క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకు రాజ్య సభ ఆమోదించింది. బుధవారం జరిగిన రాజ్య సభ సమావేశాల్లో క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో రాజ్య సభ సభ్యులు.. ఈ బిల్లును ఆమోదించారు. కాగ ఈ నెల 4 వ తేదీన లోక్ సభలో ఆమోదం పొందింది. తాజా గా బుధ వారం రాజ్య సభలోనూ ఆమోద ముద్ర పడింది. దీంతో పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే ఈ బిల్లు.. చట్టంగా మారనుంది. నేరస్థుల గుర్తింపు చట్టం – 1920 స్థానంలో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈ బిల్లుపై రాజ్య సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఈ బిల్లుతో వ్యక్తిగత గోప్యతకు భంగం ఉండదని హామీ ఇచ్చారు. డేటా లీక్ కూడా ఉండదని స్పష్టం చేశారు. నిందితుల నుంచి వేలి ముద్రలు, అరచేతి ముద్రలు, కాలి ముద్రలు, ఫోటోగ్రాఫ్స్, ఐరీస్, రెటీనా స్కాన్, ఫిజికల్ బయలాజికల్ శాంపిల్స్ తీసుకోవడానికే ఈ బిల్లును ప్రవేశ పెట్టామని వివరించారు. దర్యాప్తు ప్రక్రియను బలోపేతం చేయడంతో పాటు.. నేర నిరూపణ రేటు పెంచడం కూడా ఈ బిల్లుతో అవుతుందని అన్నారు.