మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే నేటి తరం హీరోల్లో త్రిపాత్రాభినయం చేస్తున్న రెండో హీరో చరణ్. అంతకు ముందు జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో మెప్పించాడు.
ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించాడు చరణ్. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సందేశంతో కూడిన హై ఓల్టేజ్ మూవీగా రూపొందిస్తున్నాడట. షుటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు టైటిల్‌పై స్పష్టత మాత్రం రావట్లేదు. ఇప్పటి వరకు విశ్వంభర, అధికారి, సర్కారోడు వంటి టైటిల్స్ వినిపించినా అవేవి కన్ఫామ్ కాలేదు.
చరణ్ ఈ చిత్రంలో సివిల్ సర్వీస్ ఆఫీసర్‌గా మరియు పొలిటికల్ నాయకుడిగా నటిస్తుండటంతో “అధికారి” అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ బావించారట. అందులో బాగంగానే “అధికారి” టైటిల్ లీక్ చేశారు. టైటిల్‌పై అభిమానులనుండి నెగెటివ్ రెస్పాన్స్ రావటంతో డ్రాప్ అయ్యారు. “విశ్వంభర” టైటిల్ మాస్ ఆడియన్స్‌కు రీచ్ కాదని, “సర్కారోడు” టైటిల్ వేరే హీరోలను గుర్తు తెచ్చేలా ఉందంటూ కామెంట్లు రావడంతో కొత్త టైటిల్ అన్వేషణలో పడ్డారు చిత్ర యూనిట్.
ఇక ఇప్పుడు సరికొత్త టైటిల్ “సిటిజన్” అంటూ సెట్ చేసినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో, అభిమానులనుండి టైటిల్‌పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందట. మొత్తానికి సిటిజన్ ఫైనల్ చేసేలా ఉన్నారు. పాన్ ఇండియా సినిమా కావడం “సిటిజన్” కు యూనివర్సల్ అప్పీల్ ఉండటంతో ఈ టైటిల్‌నే ఖరారు చేస్తారేమో చూడాలి.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సునీల్, శ్రీకాంత్, జయరామ్, అంజలి, నవీన్ చంద్ర, తదితర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.