రామ్ చరణ్ కొత్త లుక్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో #RC15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నట్లు.. ఇటీవల ఆయన కష్టానికి తగిన ఫోటోలు , వీడియోలు వైరల్ అవుతూ ఉండడంతో అర్థమవుతోంది. ఇక ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా.. కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరిచిత్రాలను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.

ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ మేకోవర్ కూడా సరికొత్త లుక్కులో కనిపిస్తోంది. బాడీ , న్యూ లుక్స్ తో రామ్ చరణ్ అదరగొడుతున్నట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ కోసం ఆయన న్యూ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవ్వగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.

సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అయిన అలీమ్ హకీమ్ రాంచరణ్ కోసం సరికొత్త హెయిర్ స్టైల్ ను అందించారు. లాంగ్ హెయిర్ లో రామ్ చరణ్ లుక్ అదిరిపోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంత అందమైన లుక్ ను తనకందించినందుకు అలీమ్ కు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ ఇందులో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version