రామబాణం నుంచి ‘నువ్వే..నువ్వే..’ సాంగ్‌ రిలీజ్‌

-

చాలా కాలం గ్యాప్ తర్వాత మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తోన్న చిత్రం రామబాణం. డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇదివరకు విడుదలైన రెండు లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు మేకర్స్.

Ramabanam  lyrical song released

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. ‘మొదటిసారిగా మనసుపడి .. వదలకుండ నీ వెంటపడి .. మొదలైంది నా గుండెల్లో లవ్ మెలోడీ’ అంటూ ఈ పాట మొదలవుతోంది. గోపీచంద్ – డింపుల్ హయతిపై ఈ పాటను విదేశాల్లో చిత్రీకరించారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, రితేశ్ ఆలపించాడు. దినేశ్ కుమార్ కొరియోగ్రఫీని అందించాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news