RC15 : రాజమండ్రిలో చరణ్..వీడియో వైరల్

-

RRR తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ఆర్సి 15. ఈ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా, ఈ మూవీలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రి జరుగుతోంది. ఈ మేరకు చిత్ర బృందం రాజమండ్రి సమీపంలోని రంప చోడవరం చేరుకుంది. అయితే.. రామ్‌ చరణ్‌ కారులో నుంచి దిగిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version