రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం

-

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు నెలవంక కనిపించడంతో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నట్లుగా ముస్లిం మత పెద్దలు వెల్లడించారు. ఇప్పటికే మసీదుల్లో సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం అయ్యాయి. రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. నెలవంక కనిపించడంతో రేపటి నుంచి మొదటి ‘ రోజా’ ను పాటించనున్నట్లు ముస్లిం మతపెద్దలు తెలిపారు. లక్నో ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్, ఇతర మతపెద్దలు బైానక్యులర్ల ద్వారా చంద్రున్ని చూసి రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని కన్ఫామ్ చేశారు. ఇప్పటికే లక్నో, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో రంజాన్ శోభ కనిపిస్తోంది. షాపింగ్ లు లైటింగ్ లతో కలకల్లాడిపోతున్నాయి. ఇక హైదరాబాద్ లో చాలా చోట్ల హలీం బట్టీలు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసంలో హలీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news