వారివల్లే స్టార్ హీరోయిన్గా మారిన రమ్యకృష్ణ.. అసలు విషయం ఏమిటంటే..?

-

స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఏ పాత్ర చేసినా సరే పూర్తిస్థాయిలో లీనమైపోయి ఆ పాత్ర ఆమె తప్ప మరొకరు నటించలేరు అనేంతగా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటుంది. ఇకపోతే బాహుబలి సినిమాలో శివగామి పాత్ర పోషించిన ఈమె ఆ తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలలో పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇదిలా ఉండగా సరిగ్గా రమ్యకృష్ణ కెరియర్ ను టర్న్ చేసిన నరసింహ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాతోనే రమ్యకృష్ణ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ ఇమేజ్ను సంపాదించుకోవడానికి కారణం ఇద్దరు స్టార్ హీరోయిన్లని తెలియడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సౌందర్య హీరోయిన్గా నటించిన చిత్రం నరసింహ. ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో రజనీకాంత్ తో పోటీపడి మరీ విలన్ పాత్రలో నటించింది రమ్యకృష్ణ . ముఖ్యంగా ఈ పాత్ర వల్ల ఈ సినిమాకు మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. రమ్య కృష్ణ వల్లే సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడమే కాదు ఈ పాత్రను రమ్యకృష్ణ తప్ప మరెవరు చేయలేరు అనే అంతగా ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు. ఇకపోతే ముందుగా ఈ పాత్ర కోసం నరసింహ సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ స్టార్ హీరోయిన్ నగ్మాను సంప్రదించారట. అయితే ఆమెకు పాత్రను నచ్చినప్పటికీ వేరే సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం చేత ఆమె ఈ పాత్రను వదులుకోవడం జరిగింది.

ఇక మరొక హీరోయిన్ తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో అప్పటికే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న మీనా ను కూడా సంప్రదించగా అప్పటికే మీనాకు సంబంధించిన అన్ని విషయాలను ఆమె తల్లి నిర్ణయం తీసుకునేదట. ఇకపోతే ఈ పాత్ర మీనాకు నచ్చినప్పటికీ ఆమె తల్లికి నచ్చకపోవడంతో ఈ చిత్రాన్ని వదులుకుంది మీనా. చివరికి రమ్యకృష్ణ డేట్ లు ఖాళీగా ఉండడంతో ఈ పాత్రను ఆమెతో చేయించారు. ఇక అలా వారి వల్లే ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version