‘రణ్​​వీర్​ ప్లీజ్​ మరో న్యూడ్​ ఫొటోషూట్​ చేయ్’​.. రిక్వెస్ట్​ ఎవరు చేశారంటే?

-

న్యూడ్​ ఫొటోషూట్​తో చిక్కుల్లో పడిన బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​సింగ్​కు.. మరోసారి అదే రకమైన ఫొటోషూట్​ ఆహ్వానం అందింది. మూగజీవాల సంరక్షణకు పాటుపడే ‘పీపుల్​ ఫర్​ ఎథికల్​ ట్రీట్​మెంట్​ ఆఫ్​ యానిమల్స్​’ (పెటా) .. జంతువుల పరిరక్షణ కోసం న్యూడ్​ ఫొటోషూట్​ చేయాలని ఆహ్వానించింది.

ప్రజలను శాఖాహారులుగా మార్చాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలంటూ రణ్​వీర్​సింగ్​ను సంప్రందించింది. మూగజీవాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన ప్రచార కార్యాక్రమంలో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తూ లేఖను రాసింది. ఈ లేఖలో ప్రచారంలో పాల్గొనే ఇతర సెలబ్రెటీలతో పాటు.. శాఖాహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సంస్థ వివరించింది. అయితే ఇప్పటికే న్యూడ్​ ఫొటోషూట్​తో చిక్కుల్లో పడిన రణ్​వీర్​.. ఈ ఆఫర్​ను అంగీకరిస్తాడా? అన్నది తేలాల్సి ఉంది.

ఇటీవల బాలీవుడ్ స్టార్​ రణ్​వీర్​ సింగ్​.. పోస్ట్​ చేసిన న్యూడ్​ ఫొటోషూట్​ చిత్రసీమలో హాట్​ టాపిక్​గా మారింది. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆయన దిగిన ఫొటోలు బాగా వైరల్​గా మారాయి. ముంబయిలోని చెంబూర్​ పోలీస్​ స్టేషన్​లో రణ్​వీర్​పై ఫిర్యాదు నమోదైంది. ఓ ఎన్​జీఓ సంస్థ ఈ కంప్లెయింట్​ ఇచ్చింది.

రణ్​వీర్..​ మహిళల మనోభావాలను దెబ్బతీశాడని, వారిని అవమానించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు రిజిస్టర్​ చేయాలని డిమాండ్​ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణవీర్ ‘సర్కస్’, ‘రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన భార్య హీరోయిన్​ దీపికా పదుకోణె.. ‘ప్రాజెక్ట్ కే’, ‘పఠాన్​’ చిత్రాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news