కూతురిపై అత్యాచారం… చంపి పగ తీర్చుకున్న తండ్రి

తన కూతురిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడని నిందితుడిపై కాల్పులు జరిపి చంపేసి పగ తీర్చుకున్నాడు ఓ తండ్రి. సాక్షాత్తు కోర్ట్ ముందే ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే బీహార్ లోని ముజఫర్ పూర్ లో జరిగింది. దిల్షాద్ హుస్సేన్ (25) అనే యువకుడు నేర విచారణలో భాగంగా స్థానికంగా ఉండే జిల్లా కోర్ట్ కు హాజరయ్యాడు. అదే సమయంలో సెక్యురిటీని తప్పించుకుని రిటైర్డ్ బిఎస్‌ఎఫ్ జవాన్ భగవత్ నిషాద్ అక్కడకు చేరుకుని దిల్షాన్ హుస్సేన్ తలపై తన లైసెన్డ్ తుపాకీతో కాల్చి చంపాడు.

గోరఖ్‌పూర్‌లోని బదల్‌గంజ్‌లోని పట్నాఘాట్ తిరాహా వద్ద రిటైర్డ్ బిఎస్‌ఎఫ్ జవాన్ భగవత్ నిషాద్ ఇంటి ముందు దిల్షాద్ హుస్సేన్ పంక్చర్ షాప్ నడుపుతుండే వాడని.. అతని మైనర్ కుమార్తెను ఫిబ్రవరి 12, 2020న దిల్షాద్ కిడ్నాప్ చేశాడని.. దీనిపై ఫిబ్రవరి 17న భగవత్ అత్యాచారం కేసు నమోదు చేశాడు. కేసు నమోదు తర్వాత మార్చి 12, 2021 న, పోలీసులు దిల్షాద్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి, మైనర్ బాలికను రక్షించారు. దిల్షాద్‌పై ఐపీసీ సెక్షన్‌ 363, 366, 376 (కిడ్నాప్ మరియు రేప్) మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.