శుభ‌వార్త : కోలుకుంటున్న గాన కోకిల !

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ జనవరి 8 వ తేదీన కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్‌ రావడంతో… సరిగ్గా పదిహేను రోజుల కిందట ఆమెను ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రిలో ఆమె కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్‌ కు.. ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొదట ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటూ ఆమె కుటుంబ సభ్యులు చెబుతూ వస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ముంబై బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి వైద్యలు గాయని లతా మంగేష్కర్‌ హెల్త్‌ బులిటెన్ ను విడుదల చేశారు. ” నిన్నటి నుండి గాయని లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగుపడింది, అయితే ఇంకాను ఆమె ఐసియులో పరిశీలనలో కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. ఆమె తర్వలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాం” అంటూ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ లో పేర్కొన్నారు వైద్యులు. ఇక బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి వైద్యలు తాజాగా ప్రకటించిన హెల్త్‌ బులిటెన్‌ తో లతా మంగేష్కర్‌ అభిమానులు, కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.