వనపర్తి జిల్లాలో అరుదైన పాము.. గ్రీన్‌ వైన్‌

-

ఆ భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జీవులు జీవిస్తున్నాయి. అయితే కొన్ని మనుషులకు హాని కలగించేవి అయితే.. కొన్ని మనుషులతో కలిసి జీవించేవి కొన్ని.. అయితే.. పాముల్లో కొన్ని హాని కలిగించే పామలుంటే.. మరికొన్ని ప్రమాదకరం కానివి కూడా ఉంటాయి. అయితే దాదాపు 20 సంవత్సరాల తర్వాత గ్రీన్‌ వైన్‌ పాము వనపర్తి పట్టణంలో కనిపించింది. ర్యాంకర్‌ స్కూల్‌ సమీపంలోని ఓ చెట్టుపై ఈ పాము కనిపించగా.. కాలనీవాసులు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.

ర్యాంకర్స్ స్కూల్ ప్రాంతానికి చేరుకున్న కృష్ణ సాగర్ చెట్ల కొమ్మలపైనున్న పామును గుర్తించి, పట్టుకున్నారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ గ్రీన్‌ వైన్‌ (పసిరికపాము) ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో కనబడుతుందని పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైన సర్పాలను పట్టుకున్నామని, గ్రీన్‌ వైన్‌ స్కేన్‌ను పట్టుకోవడం తొలిసారని తెలిపారు. తొలిసారిగా వనపర్తిలో పాము కనిపించిందని, పాము ఎక్కువగా ఆకు రంగులో కలిసి పోయి జీవిస్తాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news