RASHMI : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ!

-

జబర్ధస్త్‌ యాంకర్‌ రష్మి గురించి తెలియని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బ్యూటీ ఫుల్‌ ఫేమస్‌. యాంకరింగ్‌ తో పాటు ఎప్పుడు సోషల్ మీడియలో యాక్టివ్‌ గా ఉంటూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. అయితే.. తాజాగా రష్మీ సీక్రెట్‌ గా పెళ్లి చేసుకుందనే వార్త వైరల్‌ గా మారింది. రష్మీ గౌతమ్‌ – సుడిగాలి సుధీర్‌ లవ్‌ గా ఉన్నారని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని గతంలోనే వార్తలు వినిపించాయి.

అయితే.. ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే తాము లవర్స్‌, ఆఫ్‌ స్క్రీన్‌ లో తాము మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే అని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీరి పెళ్లి గురించి అప్పుడప్పుడు గాసిప్స్‌ వినిపిస్తూనే ఉంటాయి. అయితే.. తాజాగా రష్మీ ఓ వ్యక్తిని సీక్రెట్‌ గా పెళ్లి చేసుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అతను ఓ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌ గా పని చేస్తున్నాడని.. లాక్‌ డౌన్‌ లో కుటుంబ సభ్యల సమక్షంలో వీరి వివాహం కూడా జరిగిందని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం రష్మీ తన భర్తతో కలిసి.. హైదరాబాద్‌ లోనే నివాసం ఉంటుందని.. కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనిపై రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version