సుధీర్‌తో తనకున్న బంధం గురించి..అసలు సీక్రెట్ రివీల్ చేసిన రష్మి..!!

-

బుల్లితెరపైన యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది రష్మి గౌతమ్. నవ్వులు పూయించడంలో తనకంటూ ఓ విభన్నమైన శైలి ఉందని ప్రూవ్ చేసుకుంది. ఇక యాంకర్ సుధీర్ తో తన లవ్ ట్రాక్ గురించి సోషల్ మీడియాలో, మీడియాలో ఎప్పుడూ డిస్కషన్ అవుతూనే ఉంటుంది. అయితే, ఈ విషయమై ఎప్పుడూ క్లారిటీ ఇవ్వని రష్మి..తాజాగా తన మనసులో మాట చెప్పేసింది.

 

ఈ టీవీ షోలతో పాటు చాలా కార్యక్రమాల్లో రష్మి-సుధీర్ ల రీల్ లైఫ్ పెళ్లి జరిగింది. వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి బోలెడన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆడియన్స్ అయితే నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే అనుకునే స్థాయికి వీరు స్కిట్లు చేశారు. అయితే, అవన్నీ స్క్రిప్టెడ్ అనే చర్చ కూడా ఉండేది. కాగా, తాజాగా రష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.

సుధీర్ ఇటీవల ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ నుంచి తప్పుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు వచ్చిన నేపథ్యంలో సుధీర్ ఈ షోలకు బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సంగతి అలా ఉంచితే..‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వారి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇందులో ఓ రొమాంటిక్ సాంగ్ వస్తుంది. అదంతా చూసి హైపర్ అది..ఇవన్నీ చూసిన తర్వాత నీకు ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ ఉందా? ఎవరినైనా మిస్ అవుతున్నావా? అని అడిగాడు. అప్పుడు రష్మి చెప్పిన సమాధానం విని అందరూ షాక్ అయ్యారు.

‘మనసులకు దూరానికి సంబంధం ఉండబోదని, అవి ఎక్కడ ఉన్నా కలిసే ఉంటాయని’ తెలిపింది. అది ఇన్ డైరెక్ట్ గా సుధీర్ గురించి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అలా సుధీర్ తో ఉన్న రిలేషన్ ..సీక్రెట్ రివీల్ చేసిందని అందరూ అనుకుంటున్నారు. అలా అందరి ముందు రష్మి…సుధీర్ తో తన బంధం గురించి చెప్పేసిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version