Rashmika : వైట్ సారీలో సెగలు రేపుతున్న రష్మిక

-

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల వ‌చ్చిన పుష్ప సినిమా త‌ర్వాత నేషన‌ల్ క్ర‌ష్ రష్మిక మంద‌న్న క్రేజ్ విప‌రీతంగా పెరిగిపోయింది. ఈ సినిమాలో రష్మిక మంద‌న్న డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించినా.. మంచి మార్కులే కొట్టేసింది ఈ క‌న్న‌డ భామ. అయితే ఈ క‌న్న‌డ బ్యూటీ టాలీవుడ్ తో పాటు సౌత్ లో సూప‌ర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఛ‌లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రష్మిక మంద‌న్నకు వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి.

ఛ‌లో త‌ర్వాత విజ‌య్ దేవ‌రకొండ తో గీత గోవిందం తో పాటు దేవ దాసు వంటి సినిమాల‌లో వ‌రుస‌గా న‌టించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ల స‌ర‌సన చేరింది. అంతే కాకుండా ఈ క‌న్న‌డ బ్యూటీ నేషన‌ల్ క్ర‌ష్ అనే పేరును కూడా తెచ్చుకుంది. అయితే ఇటీవ‌ల ఒక ఫొగ్రంలో డైరెక్ట‌ర్ సుకుమార్.. రష్మిక గురించి చెబుతూ.. ”పుష్ప సినిమాలో ఇంత డీ గ్లామ‌ర్ గా మేక‌ప్ వేసినా.. రష్మిక ఇంత అంద‌గా ఉందేంటి అని అనుకున్నాను” అని అన్నారు.

సుకుమార్ డైలాగ్ తో హీరోయిన్ రష్మిక మంద‌న్న‌కు నేషన‌ల్ క్రష్ అనే పేరు ఎందుకు వ‌చ్చిందో తెలుస్తుంది. కాగ ఈ నేషన‌ల్ క్ర‌ష్ పేరుకు న్యాయం చేస్తు మ‌రోసారి త‌న లుక్ తో కుర్ర‌కారుకు సెగులు రేపుతుంది రష్మిక మంద‌న్న. తాజా గా కొన్ని ఫోటోల‌ను రష్మిక మంద‌న్న విడుద‌ల చేసింది. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

కాగ ఈ ఫోటో లో రష్మిక మంద‌న్న వైట్ క‌ల‌ర్ సారీలో ఉండి కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటుంది. ఈ ఫోటోల‌తో రష్మిక మంద‌న్న అభిమానుల సంఖ్య పెర‌గ‌డం కూడా ఖాయం గానే అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version