ఎర్రటి మిర్చిగా రెచ్చిపోయిన రష్మిక మందాన..

-

క్యూట్ హీరోయిన్ రష్మిక మందన..‘‘ఛలో’’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత అనతి కాలంలోనే ఈ సుందరి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.

తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అమ్మడికి మంచి అవకాశాలు రాగా వాటిని సద్వినియోగం చేసుకుంది. ప్రజెంట్ ఈ భామ పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.


ఇక ఇటీవల విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘‘పుష్ప’’ సినిమాలో ‘‘శ్రీ వల్లీ’’ క్యారెక్టర్ తో దేశవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయింది. డీ గ్లామర్ రోల్ ప్లే చేసి ..‘‘రా రా సామి’’ అంటూ ప్రేక్షకుల‌ను ఎంటర్ టైన్ చేసింది.

ఈ సుందరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో రెడ్‌ కలర్‌ సారీ కట్టుకుని దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో క్యూట్ బ్యూటీ చాలా హాట్ గా కనబడుతోంది. సదరు ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘వైట్‌ డ్రెస్సులో కుర్రకారు మైండ్ బ్లాక్, బ్యూటిఫుల్, వెరీ హాట్’’ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన..‘‘మిషన్ మజ్ను, గుడ్ బై, తలపతి 66’’ సినిమాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version