ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. క్రికెట్ బెట్టింగ్ చ‌ట్ట‌బ‌ద్ధం చేయాలి

-

టీమిండియా మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. క్రికెట్ బెట్టింగ్ ద్వారా అనేక లాభాలు ఉంటాయని అన్నారు. అంతే కాకుండా క్రికెట్ బెట్టింగ్ ను చ‌ట్ట బ‌ద్ధం చేయాల‌ని అన్నారు. ప్ర‌పంచంలో చాలా దేశాల్లో ఇది అమ‌లు లో ఉంద‌ని అన్నారు. క్రికెట్ బెట్టింగ్ ద్వారా ప్ర‌భుత్వాలకు కూడా ప‌న్నుల రూపంలో ఆదాయం వ‌స్తుంద‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను ర‌విశాస్త్రి ఒక మీడియా స‌మావేశంలో అన్నారు. అలాగే క్రికెట్ బెట్టింగ్ ను అణిచివేయాల‌ని ప్ర‌య‌త్నం చేసినా.. అది కుద‌ర‌ద అన్నారు.

బెట్టింగ్ ను నియంత్రిస్తు ఎన్ని చ‌ట్టాలు చేసినా.. చాటుగా అయినా న‌డుస్తుంద‌ని అన్నారు. అలాగే కోహ్లికి క్రికెట్ అంటే ఫ్యాష‌న్ అని అన్నారు. అంత‌లా క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌ని అన్నారు. టెస్టుల‌లో అత్యుత్త‌మ కెప్టెన్ విరాట్ కోహ్లినే అని అన్నారు. అత‌ని రికార్డులే దానికి సాక్ష్యం అని అన్నారు. అలాగే విరాట్ కోహ్లి బీసీసీఐ చీఫ్ గంగూలీ మ‌ధ్య లో న‌డుస్తున్న వివాదం పై స్పందించాడు. కోహ్లి వైపు అంతా చెప్పాడ‌ని అన్నారు. అలాగే గంగూలీ కూడా చెబుతే అంతా క్లారిటీ వ‌స్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version