కొడుకు ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రవితేజ..!

-

తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమా వచ్చే శుక్రవారం అంటే ఏప్రిల్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ధమాకా, వాల్తేరు వీరయ్య సక్సెస్ లతో జోరు మీద ఉన్న రవితేజ రావణాసుర సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర ఇంటర్వ్యూలో రవితేజకి ఆయన కొడుకు మహాధన్ హీరోగా ఎంట్రీ పై పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో కూడా ఆయన సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో రవితేజను చాలామంది ఇదే విషయం అడిగారు.

మరి ఏమైందో తెలియదు కానీ రవితేజ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇప్పుడు తాజాగా రావణాసుర ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ రవితేజని కొడుకు మహాధన్ సినిమాలోకి ఎప్పుడు రాబోతున్నాడు అనే ప్రశ్న అడిగారు. దానికి రవితేజ నా కొడుకు మహాధన్ సినిమాల్లోకి రావచ్చు.. రాకపోవచ్చు.. ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నేను చెప్పలేను. వాడికి పూర్తి క్లారిటీ ఉంది.. సినిమాల్లోకి రావాలో వద్దో అనేది వాడి ఇష్టం. నాకు తెలిసినంతవరకు డెఫినెట్గా వాడు సినిమాల్లోకి వస్తాడు.. సినిమాలంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంది అంటూ రవితేజ కొడుకు ఎంట్రీ పై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు వాడేదో చేస్తున్నాడు.. చేయనివ్వండి.. వాడు సినిమాల్లోకి వస్తాడు కానీ అది ఎప్పుడు వస్తాడో చెప్పను అంటూ రవితేజ తెలిపాడు..పోనీ ఇండస్ట్రీకి వచ్చే ముందు మీరు మీ కొడుకుకు ఎలాంటి సలహా ఇస్తారు అని అడగగా.. అసలు ఇవ్వను.. నేను ఇచ్చే సలహాలు ఎప్పుడో అయిపోయాయి.. వాడు చాలా క్లియర్ గా ఉన్నాడు.. నా సలహాలు తీసుకునే స్టేజ్ కూడా దాటిపోయాడు. ఇప్పుడు అన్ని వాడే తెలుసుకోవాలి అంటూ కొడుకు సినీ రంగ ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు రవితేజ.

Read more RELATED
Recommended to you

Latest news