5 గురు హీరోయిన్లతో రవితేజ “రావణాసుర”

-

మాస్ మహారాజ రవితేజ ” రావణాసుర” అనే మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నాడు.వరుస సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో నటిస్తున్నాడు .ఈ సినిమా “ది కశ్మీర్ ఫైల్స్” మూవీ నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.తాజాగా వచ్చిన ఖిలాడి సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది.ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది.

ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు.అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు.ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమౌతుంది.హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news