టాలీవుడ్ లో రవితేజ అంత జోష్ ఉన్న నటుడు మళ్ళీ దొరకడు అని అంతా అనుకున్నారు. కానీ విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలో అన్నీ రవితేజ లాగా కాకుండా.. ఎంతో కామెడీ ని పండించి హుషారుగా నటించగల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ – విశ్వక్ సేన్ మరియు మంచు మనోజ్ ల కలయికలో ఒక సినిమా రానుందని వార్తలు జోరందుకున్నాయి. రవితేజ మరియు విశ్వక్ సేన్ లు హీరోలుగా నటిస్తుండగా, మంచు మనోజ్ మాత్రం విలన్ గా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీని తెరకెక్కించి సక్సెస్ అయిన సందీప్ రాజ్ డైరెక్టర్ గా చేయనున్నారని తెలుస్తోంది.
“రవితేజ – విశ్వక్ సేన్”ల కాంబోలో బిగ్ ముల్టీస్టారర్ ?
-