ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్ జట్టు పైన ఓడిపోయిన…RCBకి బిగ్ షాక్ తగిలింది. GTతో జరిగిన మ్యాచులో RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయమైంది. మ్యాచ్ 12వ ఓవర్‌లో కృనాల్ పాండ్య వేసిన షార్ట్ బంతికి సాయి సుదర్శన్ పుల్ ఆన్ ఆడాడు.

బంతి అందుకొనే క్రమంలో కోహ్లీ చేతి వేలికి బలంగా తాకింది. నొప్పితో కోహ్లీ మోకాలి మీద కూర్చుండి పోవడంతో ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో RCB ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. నెక్ట్స్ మ్యాచ్ ఆడగలడా లేదా అని ఆరా తీస్తున్నారు.