ఐపీఎల్ 2022లో భాగంగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్ల్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
డెవన్ కాన్వే 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మొయిన్ అలీ 34 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2, హాజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్‌కు చేరాలనే చెన్నై ఆశలు మరింత సన్నగిల్లాయి.