టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ

-

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ నాలుగో మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియ‌న్స్ తో తలపడనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబైలోని బ్ర‌బౌర్నే స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రుగుతోంది. తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన ముంబై ఇండియ‌న్స్ అదే విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగించాల‌ని భావిస్తోంది. ఓట‌మితో తమ లీగ్‌ను ప్రారంభించిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించాలనే పట్టుతో ఉంది.

డ‌బ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై, గుజ‌రాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ, అమేలియా కేర్ (47), హేలీ మ్యాథ్యూస్ (44) రాణించ‌డంతో 143 ర‌న్స్ తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 60 ప‌రుగుల తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ ఓపెన‌ర్లు ష‌ఫాలీ వ‌ర్మ (84), మేగ్ లానింగ్ ఫిఫ్టీల‌తో చెల‌రేగ‌డంతో ఆ జ‌ట్టు 207 ర‌న్స్ చేసింది.

ఆర్సీబీ జ‌ట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), రీచా ఘోష్ (వికెట్ కీప‌ర్), సోఫీ డెవినే, హీథ‌ర్ నైట్, దిశా క‌సాత్, ఎలిసే పెర్రీ, క‌నికా అహుజా, అషా శోభ‌న‌, ప్రీతీ బోస్, మేగ‌న్ ష‌ట్‌, రేణుకా ఠాకూర్.

ముంబై ఇండియ‌న్స్ : హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), య‌స్తికా భాటియా (వికెట్ కీప‌ర్), హేలీ మ్యాథ్యూస్, నాట్ సీవ‌ర్ బ్రంట్‌, ధారా గుజ్జ‌ర్, అమేలియా కేర్, పూజా వ‌స్త్రాక‌ర్, అమ‌న్‌జోత్ కౌర్, జింతిమ‌ణి క‌లిత‌, ఇసీ వాంగ్, సోన‌మ్ యాద‌వ్‌, సైకా ఇష‌క్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version