పాన్ కార్డు పోయిందా..? ఇలా ఈజీగా పొందొచ్చు.. కంగారు పడద్దు..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. ఏ ఆర్థిక లావాదేవీ చేయాలన్నా కూడా పాన్ కార్డు తప్పక ఉండాలి. విసాకి కూడా పాన్ కావాలి. ముఖ్యంగా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు కూడా పాన్ కావాలి. జీవిత కాల వ్యాలిడిటీతో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీన్ని ఇస్తుంది. మీ పాన్ కార్డు పోయిందా..? ఏం టెన్షన్ పడకండి.

అలానే మీరు మీ కార్డు ని పోగుట్టుకుంటే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుండి డూప్లికేట్ కార్డు ని పొందొచ్చు. మరి ఇక దీని కోడం పూర్తి వివరాలని చూసేద్దాం. రీఅప్లై చేసుకోవడం ద్వారా పోయిన పాన్ కార్డ్ స్థానంలో కొత్త కార్డ్ ని మనం పొందవచ్చు. పాన్ కార్డ్ పోతే మీరు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ లో ఎఫ్‌ఐఆర్ ని నమోదు చేసుకోవాలి. ఇలా చేస్తే మీ పాన్ కార్డును మరొకరు తప్పుగా ఉపయోగించే ఛాన్స్ ఉండదు.

ఇలా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు:

మొదట TIN-NSDL అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి.
అప్లికేషన్ విధానాన్ని సెలెక్ట్ చేయండి.
పాన్ కార్డులో మార్పులు, తప్పులను అప్డేట్ చెయ్యండి లేదంటే రీప్రింట్ పాన్ కార్డ్ ని ఎంచుకోండి.
పేరు, జన్మదినం, మొబైల్ నంబర్, వంటి డీటెయిల్స్ ని ఇచ్చేయండి. సబ్‌మిట్ బటన్ ని నొక్కండి.
ఇప్పుడు ఓ టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. అప్లికెంట్ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి వస్తుంది.
పెర్సనల్ డీటెయిల్స్ ని ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ విధానాలను ఎంచుకోండి.
మూడు రకాలుగా అప్లికేషన్ ఫామ్ ని మీరు ఇవ్వచ్చు.
డైరెక్ట్ గా డాక్యుమెంట్లను సబ్మిట్ చెయ్యండి. ఈ-కేవైసీ ద్వారా డిజిటల్‌గా డాక్యుమెంట్లు ఇవ్వడం లేదా ఇ-సైనింగ్ ద్వారా సబ్మిట్ చెయ్యండి.
లేదంటే మీరు ఎన్ఎస్‌డీఎల్‌కు రిజిస్టర్ట్ పోస్ట్ ద్వారా అవసరమైన డాక్యుమెంట్స్ ని పంపించవచ్చు.
ఈ సర్వీస్‌ను పొందడానికి ఆధార్ తప్పనిసరి.
ఇచ్చిన సమచారాన్ని ధ్రువీకరించేందుకు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చెయ్యాలి.
తుది ఫారమ్‌ సబ్‌మిట్ చేసేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అవసరం. మీరు తప్పనిసరిగా ఫిజికల్ పాన్ కార్డ్ లేదా ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ ని సెలెక్ట్ చెయ్యాలి.
ఇ-పాన్ కార్డ్‌ కోసం వాలిడ్ ఈమెయిల్ ఉండాలి. కాంటాక్ట్ వివరాలు, డాక్యుమెంట్ సమచారం అందంచి సబ్‌మిట్ చేయాలి. 15-20 వర్కింగ్ డేస్‌లో వచ్చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version