తెలంగాణలో ఈనెల ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల సంగతి ఏమో గానీ ఇప్పుడు ఆ ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు అభ్యర్థులు ఎవరు అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆ రెండు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అనే విషయం అందరికీ తెలుసు. మరి కెసిఆర్ ఎవరిని పార్లమెంట్ కు పంపిస్తారు ,ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
ముందు నిజామాబాద్ మాజీ ఎంపీ కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ,నమస్తే తెలంగాణ చీఫ్ దామోదర్ రావు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అదేవిధంగా హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి పేరును టిఆర్ఎస్ అధిష్టానం పరిశీలించింది. మరికొందరు సీనియర్ నేతలు ,మాజీ ఎంపీలు రాజ్యసభ కు వెళ్లడానికి ఆసక్తి చూపించారు.
అదే విధంగా రాజ్యసభ ఎంపీగా ఉన్న కే.కేశవరావుని మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయని సామాజిక సమీకరణాలు రాజకీయ అనుభవం కేంద్రంతో సంబంధాలు ఇలాంటి వాటి విషయంలో కె.కేశవరావు పార్లమెంట్లో ఉంటే బాగుంటుంది అని భావించిన కేసీఆర్ ఒక స్థానానికి ఆయనను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే కేశవరావు తన నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. లేకపోతే పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు చేసే అవకాశం ఉంది.