జీతం సరిపోక.. ప్రధాని రాజీనామా..!

-

మామూలుగా ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు జీతం సరిపోక పోవడం… వేరే కంపెనీలో మంచి ఉద్యోగం ఆఫర్ రావడంతో వెంటనే ఆ సమయంలో చేస్తున్న ఉద్యోగాలను వదిలేస్తూ ఉంటారు ఎంతమంది. ఇలా ఉద్యోగాలను వదిలేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఉద్యోగం కోసం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఏంటి ఆశ్చర్య పోయారు కదా. కానీ ఇది నిజంగానే జరిగింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు జీతం సరిపోవడం లేదు అనే కారణంతో రాజీనామా చేశాడు.

ఈ క్రమంలోనే మరో ఆరు నెలల కాలంలో బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బోరిస్ జాన్సన్ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు ఒక పత్రికలో కాలమిస్టుగా పనిచేసే వారు. ఆ పత్రికలో ఆయనకు 2.75 లక్షల పౌండ్ల వేతనం ఇచ్చే వారు. ఇక అదనంగా డబ్బులు కూడా వచ్చేవి. కానీ ఎప్పుడైతే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారో అప్పటినుంచి బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి పదవికి గాను 1.5 లక్షల పౌండ్ల జీతం మాత్రమే అందుకుంటున్నారు. దీంతో ఆయనకు ఆ జీతం సరిపోవడం లేదని తన సంతానాన్ని చూసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందని ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు బోరిస్ జాన్సన్.

Read more RELATED
Recommended to you

Latest news