రియ‌ల్‌మి 7, 7 ప్రొ ఫోన్లు.. అదిరాయ్‌.. చార్జింగ్ స్పీడ్ కేక‌..!

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి భార‌త్‌లో కొత్త‌గా రియ‌ల్‌మి 7, 7 ప్రొ పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. రియ‌ల్ మి 7లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల గేమ్స్‌ను స్మూత్‌గా ఆడుకోవ‌చ్చు. వీడియోల క్వాలిటీ బాగుంటుంది. రియ‌ల్‌మి 7 ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌ను అమర్చారు. ఇందులో వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీకార్డుల కోసం 3 స్లాట్ల‌ను ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీనికి 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ఫోన్ 26 నిమిషాల్లో 56 శాతం వ‌ర‌కు, 65 నిమిషాల్లో 100 శాతం వ‌ర‌కు చార్జింగ్ పూర్త‌వుతుంది.

realme 7 and realme 7 pro smart phones launched

రియల్‌మి 7 స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 64, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

* రియ‌ల్ మి 7 స్మార్ట్ ఫోన్ మిస్ట్ వైట్‌, మిస్ట్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.14,999గా ఉంది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబ‌ర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌తోపాటు రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చు.

రియ‌ల్‌మి 7 ప్రొ ఫోన్‌లో… 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో స్నాప్‌డ్రాగ‌న్ 720జి ప్రాసెస‌ర్‌ను అమర్చారు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డుల కోసం 3 స్లాట్ల‌ను ఏర్పాటు చేశారు. 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇందులో ఉంది. దీనికి 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందించారు. అందువ‌ల్ల ఈ ఫోన్ కేవ‌లం 34 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ పూర్త‌వుతుంది.

రియ‌ల్‌మి 7 ప్రొ స్పెసిఫికేష‌న్లు…

* 6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 720జి ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* 64, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

* రియ‌ల్‌మి 7 ప్రొ స్మార్ట్ ఫోన్ మిర్ర‌ర్ వైట్‌, మిర్ర‌ర్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.19,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.21,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబ‌ర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్ మి ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news