భారత్ లో రియల్‌మీ బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ సేల్ కు వచ్చేసింది. తొలిసారి ఇండియాకు రావడంతో.. లాంచ్ ఆఫర్ కింద నాలుగు వేలు డిస్కౌంట్ కూడా కంపెనీ ప్రకటించింది. 11th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్ తో బుక్ ప్రైమ్ వస్తోంది. ఇంకా ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో, ధర ఎంతో చూసేద్దామా..!
రియల్‌మీ బుక్ ప్రైమ్ ధర, ఆఫర్లు
16జీబీ ర్యామ్ + 512 SSD స్టోరేజ్ ఉన్న రియల్‌మీ బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ రూ.64,999 ధరకు లాంచ్ అయింది. అయితే లాంచ్ ఆఫర్ కింద రూ.4వేల డిస్కౌంట్ ఉంది. అంటే రూ.61,999కే వస్తుందనమాట.
అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్‌కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.3,000 తక్షణ డిస్కౌంట్ వస్తుంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ (realme.com), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు.
Realme Book Prime స్పెసిఫికేషన్లు
రియల్‌మీ బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ 14 ఇంచుల 2K ఫుల్ విజన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, 3:2 స్క్రీన్ రేషియో ఉంటుంది.
11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 11320H (11th Generation Intel core i5 11320H) ప్రాసెసర్‌తో రియల్‌మీ బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ రన్ అవుతుంది.
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. డ్యుయల్ ఫ్యాన్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్ వస్తోంది.
54Wh బ్యాటరీతో ఈ ల్యాప్‌టాప్ వస్తోంది. 12 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందట. అలాగే యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌కు ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేస్తుంది. 30 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ అంటోంది.
టచ్ ప్యాడ్‌తో కూడిన బ్యాక్‌లిట్ కీబోర్డు ఉంటుంది. డీటీఎస్ టెక్నాలజీ ఉన్న స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
విండోస్, ఆండ్రాయిడ్ డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునేలా పీసీ కనెక్ట్ (PC Connect) ఫీచర్ కూడా రియల్‌మీ బుక్ ప్రైమ్‌లో ఉంటుంది.
నాలుగు థండర్‌బోల్ట్ పోర్టులు, హైస్పీడ్ వైఫై 6, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3 (Realme Buds Air 3) టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ సేల్ కూడా మొదలైంది. రూ.3,999 ధరతో 10mm డైమనిక్ బాస్ బూస్ట్ డ్రైవర్లు ఈ బడ్స్‌లో ఉన్నాయి. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 30 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఒక్కో ఇయర్‌బడ్ బరువు 4.2 గ్రాములు ఉండగా.. కేస్‌తో కలిపి 37 గ్రాముల బరువు ఉంటుందట.