మందులతో కాకుండా బీపీని ఇలా ఈ పద్దతులతో తగ్గించుకోండి..!

-

చాలా మంది ఎక్కువగా సతమతమయ్యే సమస్యల్లో హైబీపీ సమస్య కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఏదిఏమైనా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. హైబీపీ లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కేవలం మందులతో మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత విధానాన్ని బట్టి కూడా మీరు సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే మరి హైబీపీ తో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్నది చూద్దాం.

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం:

ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. రోజువారి సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించడం చాలా అవసరం. ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీపై కాస్త సమయం ఇస్తే కచ్చితంగా మీరు తగ్గించుకోవచ్చు. కనీసం రోజు 150 నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేయండి. దీనితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ లాంటి ఇబ్బందులు నుంచి కూడా బయటపడొచ్చు.

బరువు తగ్గడం:

బాగా బరువుగా ఉన్న వాళ్ళు బీపీ ని తగ్గించుకోవడానికి బరువు తగ్గొచ్చు. బరువు తగ్గిన వాళ్ళలో కూడా బీపీ కూడా తగ్గుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి హైబీపీ తో బాధపడే వాళ్ళు బరువు తగ్గడానికి చూసుకోండి.

సాల్ట్ తగ్గించండి:

మీరు తీసుకునే సాల్ట్ ని తగ్గించడం కూడా చాలా ముఖ్యం. సాల్ట్ వల్ల కూడా బిపి పెరుగుతుంది. కనుక బిపి తగ్గించుకోవడానికి సాల్ట్ ను కూడా తగ్గిస్తూ ఉండండి.

ఎక్కువ పొటాషియం తీసుకోండ:

పొటాషియం బీపీ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మనకి సాల్మన్, కూరగాయలు, ఆకుకూరలు, బీన్స్, టమాటా, బంగాళదుంప, అవకాడో, నట్స్, పండ్లు మొదలైన వాటిలో ఉంటుంది కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే బీపీ తగ్గుతుంది.

మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండండి:

హైబీపీ తో బాధపడే వాళ్ళు మద్యపానం ధూమపానానికి కూడా దూరంగా ఉంటే మంచిది. దీంతో ఇబ్బందులు ఏమి రావు. ఇలా ఈ విధంగా హైబీపీతో బాధపడే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version