రూటు మార్చిన రెజీనా.. వెబ్‌సిరీస్ క‌లిసొస్తుందా!

-

త‌న గ్లామ‌ర్ ఫేస్తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా. అయినా ఈ భామ‌కు పెద్ద‌గా క‌లిసిరాలేద‌నే చెప్పాలి. టాలీవుడ్ మీడియం హీరోల‌తోనే ఎక్కువ‌గా సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ పెద్ద హీరోల ప‌క్క‌న మాత్రం అవ‌కాశాలు రాలేదు. దీంతో ఈ భామ‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. కానీ ఇప్పుడు ఓ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

 

regina cassandra
regina cassandra

ఇప్పుడు సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా వెబ్‌సిరీస్‌లు న‌డుస్తున్నాయి. పెద్ద స్టార్ హీరోలు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్పుడు రెజీనా కూడా ఇదే బాట‌లోకి ప‌య‌నిస్తోంది.

బాలీవుడ్‌లో రాయ్ క‌పూర్ ఫిలిమ్స్ అండ్ ఎమ్మీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్‌లో ఈ హాట్ బ్యూటీకి ఆఫ‌ర్ వ‌చ్చింది. సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో కొన‌సాగుతుంది. దీంతో ఇప్పుడు రెజీనాకు మ‌ళ్లీ సుడి తిరిగింద‌ని అంతా చెప్పుకుంటున్నారు. దీంతో అయినా ఆమెకు మ‌ళ్లీ సినిమా అవ‌కాశాలు వ‌స్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news