BREAKING : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

-

తెలుగు రాష్ట్రా ల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయింది. కాసేపటి క్రితమే… ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ం లో మూడు ఎమ్మెల్సీ స్థానాలు మరియు తెలంగాణ రాష్ట్రం లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కాసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వచ్చే నెల అంటే నవంబర్‌ 9 వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు కేంద్ర ఎన్నికల సం ఘం స్పష్టం చేసింది. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 29 వ తేదీన జరుగ నుండగా.. కౌంటింగ్ కూడా అదే రోజున జరుగనుంది. ఏపీ లో మే 31, తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 3 వ తేదీతో ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.  ఎమ్మెల్యేల ఓటింగ్‌ ద్వారా ఈ ఎన్నికలు జరుగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news