TS: పీజీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణ విద్యాశాఖ డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభవార్త ప్రకటించింది. పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు తేదీని ఖరారు చేసింది. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్-2022) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ

ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి.. సీపీగెట్-2022 నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. నేటి నుంచి జులై 4వ తేదీ వరకు దరఖాస్తు పక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని లింబాద్రి పేర్కొన్నారు. విద్యార్థులు అన్ని జాగ్రత్తలు పాటించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. జులై 20 నుంచి ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news