రెమ్‌డెసివిర్ చావులను ఆపలేదు…!

-

కరోనా వైరస్ కట్టడి నేపధ్యంలో వివిధ రకాల మందుల కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే సరైన మందు అనేది ఇప్పుడు దొరకడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌ లో ఒక కీలక విషయం బయటపడింది. రోగులు ఆస్పత్రి నుంచి వేగంగా డిశ్చార్జ్ అవ్వడానికి గాని, బ్రతికే అవకాశాలపై గాని రెమ్‌డెసివిర్ ప్రభావం చూపలేదని కనుగొన్నారు.

30 కంటే ఎక్కువ దేశాలలో 11,266 వయోజన రోగులలో ఈ పరిక్షలు చేసారు. అసలు ఆ మందు ఏ విధంగా పని చేస్తుంది అనే దాని మీద సర్వే నిర్వహించి ఈ విషయం బయట పెట్టారు. ఆసుపత్రిలో చేరిన రోగులలో 28 రోజుల మరణాలను విశ్లేషించారు. అయితే ఇంకా ఈ సర్వే ఫలితాలను పూర్తిగా వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version