మూడంటే మూడు రూలింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి.. ఓ విధంగా ఇవే శాసిస్తున్నాయి. ఈ చర్చకు తావిచ్చిన రేణుకా చౌదరికి ముందు థాంక్స్ చెప్పాలి. అదేవిధంగా రుజువర్తనలో రాజకీయాలు చేస్తూ, తమ తమ జీవితాలను వివిధ పార్టీలకే అంకితం ఇచ్చిన వారికీ థాంక్స్ తప్పక చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి చర్చలో కమ్మలు, రెడ్లు కీలకం. అలా అని వారంతా గొప్పగా పదవుల్లో ఉన్నారని అనుకోలేం. అందులో కొందరికే అందలం.మిగతావారు పదవులు అందుకున్న దాఖలాలే లేవు. ఆ విధంగా రేణుకా చౌదరి చెప్పిన మాటలు విశ్లేషించుకోవాలి.
రెండు తెలుగు రాష్ట్రాలలో కమ్మ సామాజికవర్గ నేతలను అవసరం మేరకు వాడుకుని వదిలేస్తున్నారని, వారిని ఆర్థిక పరంగా సంబంధిత ప్రయోజన సిద్ధికి వాడుకుని వదిలేస్తున్నారని రేణుకా చౌదరి అనే సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఒకప్పటి ఫైర్ బ్రాండ్ అంటున్న మాట. ఆ మాట అనుసరించి ఆలోచిస్తే ఇప్పుడు ఏపీలో జరిగింది ఇదే ! తెలంగాణలో ప్రస్తుతం అయితే ఆ పాటి చొరవ అయితే ఉంది కానీ ఇక్కడ కమ్మలకు ఆ విధంగా పరిణామాలు లేనే లేవు. కనుక రేణుకా చౌదరి చెప్పిన మాటలు అనుసరించి ఆలోచిస్తే కమ్మ సామాజికవర్గంలో కొందరు ఆర్థికంగా ఉన్నతి సాధించిన వారు ఉన్నా, రాజకీయ పదవుల్లో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ ఉన్నత స్థాయిని పొంది లేరు అన్నది ఓ వాస్తవం.
గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వారంతా పత్రికల్లో స్థిరపడిన కమ్మలు ఉన్నారు.ఆ విధంగా వారు బాగున్నారు కూడా ! అంటే వ్యాపార పరంగా కమ్మలు ఎప్పుడూ బాగానే ఉన్నారు అని అర్థం. సినిమాలపరంగా కూడా కమ్మలు బాగానే ఉన్నారు. కానీ రాజకీయ పరంగా కొన్ని సార్లు మంచి హవానే చూపిస్తున్నారు కానీ కొన్ని సార్లు చతికిలపడడం రేణుకకు నచ్చడం లేదేమో!
ఇక రెడ్లు గురించి మాట్లాడితే కాంగ్రెస్లో అంతా రెడ్లమయమే ! కనుక వైఎస్సార్ హవా నడిచింది. తరువాత కూడా రెడ్ల హవా నడుస్తోంది. ఆ మాటకు వస్తే కమ్మ నాయకుల దగ్గర రెడ్లు అంతా బాగున్నారు. కానీ రెడ్డి నాయకుల దగ్గర కమ్మలు బాలేదన్న మాట ఒకటి రాజకీయ విశ్లేషకుల నుంచి వినవస్తోంది. అంటే చంద్రబాబు దగ్గర రెడ్డి సామాజికవర్గ నేతలు పెద్దగా నష్టపోకపోయినా, జగన్ హవాలో మాత్రం కమ్మ సామాజికవర్గ నేతలు తీవ్ర స్థాయిలో నష్టాలు చవి చూశారు అన్నది ఓ వాస్తవం అని సీనియర్ జర్నలిస్టులు సైతం చెబుతున్న మాట. అంటే ఓ విధంగా జగన్ ప్రభుత్వంలో వీరెవ్వరూ ఆర్థిక ప్రయోజనాలేవీ పొందలేదు అన్నది కూడా ఓ వాస్తవం అని వారు వివరిస్తున్నారు.
ఇదే సమయంలో కాపులు మాత్రం బాగున్నారు. వాళ్లంతా అటు రెడ్లకు,ఇటు కమ్మలకు సమన్వయకర్తలుగా ఉన్నారు. ఓ విధంగా జగన్ దగ్గర బొత్స, అవంతి, కురసాల లాంటి నేతలు అంతా బాగున్నారు. ఇకపై కూడా బాగుండనున్నారు. అదేవిధంగా టీడీపీలో కూడా కాపు నేతల హవాకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం పెద్దగా ఏం లేదు. ఉత్తరాంధ్రతో సహా మరో రెండు జిల్లాల్లోనూ (ఉభయ గోదావరి జిల్లాల్లోనూ) కాపుల హవాకు అడ్డే లేదు. కనుక అటు టీడీపీతోనూ, ఇటు వైసీపీతోనూ సఖ్యంగా ఉన్న ఏకైక సామాజికవర్గం, ఇంకా చెప్పాలంటే సౌమ్యతకు నెలవైన సామాజిక వర్గం కాపులే కావడం ఓ విశేషం.