ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ రోజు అసెంబ్లీలో మూడు రాజధానులపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్ కు చిత్త శుద్ధి ఉంటే.. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పునకు రావాలని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయడు సవాల్ విసిరారు. తమ హాయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటన చేసినప్పుడు.. జగన్ అసెంబ్లీలో లేరా అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతగా అప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. అమరావతి రాజధానికి 30 వేల ఎకరాలను కేటాయించాలని జగన్ సూచించలేదా.. అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తీరా.. అని మండి పడ్డారు. వైఎస్ జగన్ రాష్ట్ర భవిష్యత్తు పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది.. అభివృద్ధి వికేంద్రీకరణ అని అన్నారు. కానీ అధికార వికేంద్రీకరణ కాదని విమర్శించారు.