ఇటు భట్టి..అటు రేవంత్..సొంత మైలేజ్?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతలు పాదయాత్రలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా కొన్ని రోజుల పాటు యాత్ర చేశారు. రాహుల్ యాత్రకు మంచి స్పందన వచ్చింది.  దానికి కొనసాగింపుగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హత్ పాదయాత్ర మొదలుపెట్టారు. వైఎస్సార్ స్పూర్తితో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.

రేవంత్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. జనం కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. అయితే రేవంత్ పాదయాత్రపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరగదని, కేవలం రేవంత్ సొంత ఇమేజ్ పెరుగుతుందని అంటున్నారు. అందుకే కొందరు సీనియర్లు రేవంత్ పాదయాత్రలో పాల్గొన్నట్లు కనిపించడం లేదు. ఇదే సమయంలో అటు మరో కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు..కానీ మధ్యలోనే అది ఆగిపోయింది.

ఇక రేవంత్ పాదయాత్ర మాత్రమే కొనసాగుతుంది. ఇదే సమయంలో సి‌ఎల్‌పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా మొదలవుతుంది. రేవంత్ ఒక్కడే చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఇతర నేతలకు ఛాన్స్ ఉండదని చెప్పి..భట్టితో పాదయాత్ర మొదలు పెడుతున్నారు. అధిష్టానం ఆదేశాలతోనే ఆయన పాదయాత్ర మొదలవుతుంది. ఆదిలాబాద్ నుంచి భట్టి యాత్ర మొదలవుతుంది. దాదాపు 41 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా 91 రోజుల పాటు పాదయాత్ర జరగనుంది.

అయితే ఈ పాదయాత్ర సొంత మైలేజ్ కోసం కాదని కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెంచేలా ఉంటుందని అంటున్నారు. అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డికి భట్టి కౌంటర్ ఇచ్చారు. కానీ ఈ పాదయాత్రలు నేతల సొంత మైలేజ్ పెరిగేలా ఉంది గాని..పార్టీ మైలేజ్ పెరిగేలా కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version