తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సీఎం కెసిఆర్ నిద్ర మత్తు వీడి అన్నీ శాఖలతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష పెట్టాలి. కడెం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని డిమాండ్ చేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న స్పృహ కేసీఆర్ కు లేనట్టు కనిపిస్తోందని.. ప్రజలు చస్తున్నా ఆయన మాత్రం రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు, సర్వే నివేదికల పై మల్లగుల్లాల్లో మునిగి తేలుతున్నాడని మండి పడ్డారు.
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టు ఉంది కెసిఆర్ వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు రేవంత్. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసే ఉన్నత స్థాయి కమిటీ ఈ 17 కమిటీలను సమన్వయం చేసుకోవాలని కోరారు. వరద అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. లేని పక్షంలో ఏ ప్రమాదం జరిగినా, ఏ చిన్నపాటి నష్టం జరిగినా దానికి స్వయంగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నానని వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.