హైదరాబాద్ లని గోపన్ పల్లి వడ్డర బస్తిలో ప్రభుత్వం కూల్చిన ఇల్ల ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు. ఇక్కడ ప్రజల నుంచి ఓట్లు వేసుకుని ఎమ్మెల్యే అయిన వారు.. ఇప్పుడు వీరిని మర్చిపోయారని విమర్శించారు. వీరికి 60 గజాల భూమి ఇచ్చి ఇల్ల నిర్మించి వాటి పట్టాలు ఇచ్చే వారకు స్థానిక ఎమ్మెల్యే ఇంట్లోనే వంటా వార్పు చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే గోపన్ పల్లి వడ్డర బస్తి పై మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.
వీరందరికీ ఇల్ల పట్టాలను అందించాలని అన్నారు. ఇక్కడే ఉండే 250 కుటుంబాల బాధ్యత కేటీఆర్ దే అని అన్నారు. అలాగే వీరికి కాంగ్రెస్ పార్టీ మద్ధత్తు కూడా ఉంటుందని ప్రకటించారు. కలెక్టర్, ఆర్డీవోతో మాట్లాడి ఇల్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. దీంతో పాటు హైదరాబాద్ లో పీజేఆర్ ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదని అన్నారు. ఆయన లోని లోటు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుందని అన్నారు.