మోదీ నేతృత్వం దేశం అత్యంత ప్రమాదకర పరిస్థిల్లోకి వెళుతోందని.. కేసీఆర్ ఏ ప్రయత్నం చేసినా యూపీఏ కూటమి విచిన్నానికే అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. టీఆర్‌ఎస్ తో కాంగ్రెస్ అస్సలు పొత్తు ఉండదని తెల్చి చెప్పారు. మోదీ ఇచ్చిన సుపారీ ఒప్పందంతో కేసీఆర్ పరోక్ష సహకారం అందిస్తున్నారని.. కేసీఆర్ ఎన్డీఏ ను గద్దెదించాలనుకుంటే ముందు వారి భాగస్వాములను బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు.
మళ్లీ కేసీఆర్ సీఎం అయెందుకు.. మోడీ ప్రధాని అయ్యేందుకు టీఆరెస్, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయి… సమస్యలను పక్కదారి పట్టించేందుకు మత విద్వేషాలురెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు.
అధికారం కోసం జరుగుతున్న కుట్రలో సామాన్యులు సమిధలు అవుతున్నారని… తెలంగాణ సమాజానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. దీనిని తెలంగాణ సమాజం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని… సీఎం హామీలు అమలు కాకపోవడంతోనే వీఆర్ఏ లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు రేవంత్ రెడ్డి. 50 రోజుల్లో 28 మంది ఉద్యోగులు చనిపోయారు.. తక్షణమే వీఆర్ఏ లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించండని డిమాండ్ చేశారు.