టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

-

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైని కలిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్టు వెల్లడించారు. రైతులు ఇప్పటికే మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్నారని… ప్రతీ మిల్లర్ దగ్గర రైతుల వివరాలు ఉన్నాయని.. వారికి బోనస్ గా రూ. 600 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళారులు, మిల్లర్లు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ. 2600 కోట్ల బియ్యాన్ని మాయం చేశారని ఆరోపించారు. ఢిల్లీలో ప్రభుత్వం నడిపేవారు గల్లీల్లో, గల్లీల్లో ఉన్న ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన పంటను పాక్ లో ఉన్న ఇమ్రాన్ ఖాన్, దుబాయ్ లో ఉన్న దావూద్ ఇబ్రహీం కొనాలా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వాలకు రైతుల ఉరివేస్తారని హెచ్చరించారు. 20 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేయని రైతులకు ఎకరాకు రూ.15 వేలు నష్టపరిహారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ పై కుటుంబంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news