ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంపై భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో ప్రజుల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కుంటుంటే కేసీఆర్ రాజకీయాలు మాట్లారంటూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కుంటున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని..జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు ఇవ్వాలి.. ప్రజలకు ఇబ్బంది లేకుండా.. అస్తి నష్టం లేకుండా చూడాలి.. కానీ.. సీఎం మాయమై.. ఇవన్నీ మర్చిపోయారంటూ ఆయన విమర్శించారు. మూడు నిమిషాలు మాట్లాడి వదిలేశారని, నిన్న ఏకపాత్రాభినయం చూశామంటూ ఆయన సెటైర్లు వేశారు. దుర్యోధన.. దుశ్శాసన పాత్రలు రక్తి కట్టించినట్టు ఉందంటూ.. కేసీఆర్‌నీ దుర్యోధనుడు సోకినట్టు ఉన్నాడని ఆయన విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా.. మోడీ దుర్మార్గుడు నిజమే… మోడీ దుర్యోధనుడు ప్రజా స్వామ్యం కి ప్రమాదమని, . మోడీ కుల గురువు… ఆదర్శం నువ్వే కదా ? అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏకనాథ్ షిండేల ఉత్పత్తి ప్రారంభించింది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆలుగడ్డ ల శ్రీనును నీ పార్టీ కాకున్నా మంత్రిని చేసింది నువ్వే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. విషపురుగులు తయారు చేసి ఊరు మీదికి తెచ్చింది నువ్వే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి…సబితా లాంటి ఏక్‌నాథ్‌షిండే లను తయారు చేసిందే నువ్వు కదా అంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు నువ్వు షిండే ల గురించి మాట్లాడుతున్నావు.. నీవరకు వస్తే కానీ తెలియ లేదా..? అని ఆయన ప్రశ్నించారు.