శ్రీలంకను రాజపక్సే ఎలా దోచాడో తెలంగాణను కేసీఆర్ అల దోచాడని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన ఏడెళ్లలో అప్పుల్లో కుర్చాడని.. సీఎం కెసిఆర్ ఒక్కడే ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని ఆగ్రహించారు. 65 ఏండ్లు పాలించిన పార్టీలకి కలిసి 16 వేల కోట్ల అప్పులు చేశాయని.. రాజకీయంగా నష్టం జరుగుతుంది అని తెలిసే తెలంగాణ ఇచ్చిన మని రాహుల్ గాంధీని చెప్పారని అన్నారు.
తెలంగాణ లో 8 వేల మంది రైతులు చనిపోయారని.. తెలంగాణ కోసం 1500 మంది చనిపోయారు అని కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు భూమికి అవినాభావ సంబంధముందని.. వ్యవసాయం పై రాష్ట్ర ప్రభుత్వం దే బాధ్యత అన్నారు. నూతన వ్యవసాయ విధానం రాష్ట్ర ప్రభుత్వాలే రూపొందించుకోవాలని.. కేంద్రం సహకారం అందించాలని డిమాండ్ చేశారు. వస్తువుల ధర ఉత్పత్తి దారుడే నిర్ణయిస్తారు…. కానీ రైతు పండించిన పంటకు మాత్రం ఎవరో రేటు నిర్ధారిస్తారని ప్రశ్నించారు. ఇంతకు మించిన దోపిడీ ఇంకొకటి ఉండదని.. రైతు మేలుకోసం…మద్దతు ధర తేచ్చింది మేమేనన్నారు.