అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్విట్ వార్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేయడంతో.. ఆ పార్టీ నేతలు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్, పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డిలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.
మొసలు కన్నీరు కార్చడం మీ పార్టీ నాయకత్వానికి ఉన్న కళ.. అని, ప్రధాని మోదీ తెలంగాణ తల్లిని, అమరవీరుల త్యాగాలను అవమానపరిచినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని.. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారంటూ.. ట్విట్లర్లో కామెంట్స్ చేశారు.
కవిత చేసిన ట్విట్ కు రిఫ్లై ఇస్తూ.. ఈవ్యాఖ్యలు చేశారు. ‘ మాజీ ప్రధానిని, మీ పార్టీ నాయకత్వాన్ని బీజేపీ పార్టీ అవమానించిందని.. మీ పార్టీనీ మీరు రక్షించుకోవడంలో వెనకబడినప్పుడు.. కేసీఆర్ అండగా నిలిచారని, సీఎం కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా దేశంలో గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించింది. ఈ కామెంట్లకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు.