రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి..వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యులు – రేవంత్

-

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వివాదం పై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మా మధ్య కొందరు అగాధం కల్గించే ప్రయత్నం చేస్తున్నారని.. రాజ్ గోపాల్ రెడ్డి వేరు.. వెంకట్ రెడ్డి వేరని చెప్పారు. వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని.. రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్ గోపాల్ రెడ్డి ప్రస్తావించే బ్రాoడ్ కాంగ్రెస్ ఇచ్చిందేనని.. రాజ్ గోపాల్ రెడ్డి పై చేసిన కామెంట్స్..వెంకట్ రెడ్డి కి వివరణ ఇస్తున్నానని రేవంత్‌ రెడ్డి తెలిపారు. వెంకట్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నా..రాజ్ గోపాల్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు రేవంత్‌.

కాంట్రాక్టులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని.. భద్రాచలం ముంపునకు కారణం మోడీ, ఆయన మంత్రివర్గం అని నిప్పులు చెరిగారు. తెలంగాణా కు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఎన్నో ప్రాజెక్టులను బిజెపి ప్రభుత్వం తిరస్కరించిందని.. తెలంగాణ కు బిజెపి ద్రోహం చేసిందని ఆగ్రహించారు రేవంత్‌.

Read more RELATED
Recommended to you

Latest news