రేవంత్ రెడ్డి: ఈటల రాజేందర్ ను మోసం చేసిన బీజేపీ

-

బీజేపీ అధిష్టానం ఇటీవల జరిగిన కాబినెట్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వాన్ని మార్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈటలకు ఈ పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు కొందరు తమ అసంతృప్తిని తెలియచేస్తున్నారు. కాగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ అధిష్టానంపై సంచలన కామెంట్ లు చేశాడు. ఈయన మాట్లాడుతూ… ఈటల రాజేందర్ ను బీజేపీ మళ్ళీ మోసం చేసిందని వాపోయారు. ఇటీవల ఈయనకు ప్రాణ హాని ఉందని చెప్పినా రక్షణ కల్పిస్తున్నారు తప్ప.. ప్రాణ హాని కల్పించేది ఎవరన్న విషయం తెలిసినా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంపే వాళ్లకు ఈ ప్రభుత్వం సహకరిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఇప్పటికైనా ఈటల రాజేందర్ కళ్ళు తెరిచి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరూ పూర్తి రక్షణను కలిగి ఉంటారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news