ఈటలకు కన్నీళ్ల విలువ తెల్వదు అంటూ రేవంత్ రెడ్డి భావోద్వేగం

-

 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ తన పై చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ కంట తడి పెట్టారు. “ఈటల రాజేంద్రా… నన్ను కేసీఆర్ కు అమ్ముడు పోయావ్ అంటావా.. నా ఆస్తి అంతా పెట్టి అధికార పార్టీ పైన కొట్లాడుతా” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆస్తి అంతా పోయినా… కట్ డ్రాయర్ పైన కూడా కేసీఆర్ తో పోరాడుతానని పేర్కొన్నారు. తమ కుటుంబం మొత్తం పోరాటానికే సిద్ధంగా ఉందన్నారు. తమ నాలుగు తరాల వరకు వారి పైన పోరాటం చేస్తామన్నారు ఆయన. తాను చేతకానితనంతో కన్నీళ్లు పెట్టలేదని, ఆవేదనతో కంటతడి పెట్టినట్లు స్పష్టం చేశారు రేవంత్. భయం తన రక్తంలో లేదని, తన చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్ తో పోరాటం తప్పదన్నారు. రాజేంద్రా… నాపై ఇష్టారీతిన మాట్లాడి, తెలంగాణ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.

The futility of attempts to 'arrest' the popularity of Congress' Telangana  point man - The Week

 

 

మున్ముందు ఎవరిని ఎవరు గద్దె దించుతారో తెలుస్తుందన్నారు రేవంత్. రాజేంద్రా.. అందరితో మాట్లాడినట్లు నాతో యథాలాపంగా మాట్లాడవద్దన్నారు. ప్రశ్నించే గొంతుల మీద ఈటెల దాడి చేస్తున్నారని, ఆయన వైఖరి తెలంగాణ సమాజానికి నష్టమా కాదా ఆలోచించుకోవాలన్నారు. తన జీవిత లక్ష్యమే కేసీఆర్ ను గద్దె దించడమని వ్యక్తపరిచారు. తాను జైలుకు వెళ్లినా కూడా కేసీఆర్ పైన పోరాటం ఆపలేదన్నారు. నోటీసులు వస్తే నీలా ఎవరి వద్దకో వెళ్లి లొంగిపోలేదని దుయ్యబట్టారు. “రాజీ నా రక్తం లేదు.. భయం నా ఒంట్లో లేదు” అని తెలిపారు రేవంత్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news