కేటీఆర్ ట్వీట్ లో పొరపాటు : రేవంత్ రెడ్డి ఫైర్

సైదాబాద్ అత్యాచార ఘటన నిందితుడు దొరికాడంటూ.. సమాచార లోపం కారణంగా మంత్రి కేటీఆర్… పొరపాటుగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అత్యంత పాశవిక దారుణాలకు మద్యం… గంజాయి… డ్రగ్స్ కారణమని మండిపడ్డారు. సైదాబాద్ ఘటన జరిగిన 24 గంటల్లో శిక్షించాలి అని కేటీఆర్… ట్విట్టర్ లో డీజీపీ నీ కోరాడని.. పోలీసులు ఐదు రోజుల తర్వాత…మాకు నిందితుడు దొరకలేదు అని ప్రకటన చేశారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

అసలు తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉందా.. ఏమౌతుంది అనేది తెలుస్తుందా ? అని నిలదీశారు. సీఎం కెసిఆర్ పుత్ర రత్నం … ట్విట్టర్ లో ఒకటి…పోలీసులు ఒక మాట చెబుతున్నారని నిప్పులు చెరిగారు. ట్వీట్ చేసిన సమయంలో ఏ మైకంలో ఉన్నాడని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కేటీఆర్ కి తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ వాడిన వాడు ఎవడైనా లోపల వెస్తం అన్నారని.. కానీఆకున్ సబర్వాల్ విచారణ మొదలవ్వగానే ఆయన్ని బదిలీ చేశారని నిప్పులు చెరిగారు. డ్రగ్స్ ఇతర దేశాల నుండి..ఇక్కడికి ఎలా వస్తుందనే దానిపై విచారణ చేయాలన్నారు.