హుజూరాబాద్‌ లో కాంగ్రెస్ కొత్త ప్లాన్…గెలిచేది ఇలాగే?

-

హుజరాబాద్ ( Huzurabad ) ఉప ఎన్నికల పోరులో బీజేపీ-టీఆర్ఎస్‌లు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్‌లో గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే బిజెపి తరఫున మాజీ మంత్రి ఈటల రాజేంద్ర బరిలో దిగి హుజురాబాద్‌లో గడపగడపకు వెళ్తున్నారు. మళ్లీ గెలిపించమని ప్రజలని కోరుతున్నారు.

Huzurabad | హుజరాబాద్
Huzurabad | హుజరాబాద్

ఈటల రాజేందర్‌కి చెక్ పెట్టి హుజరాబాద్ లో గులాబీ జెండా ఎగరేస్తాం అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అభ్యర్థి డిసైడ్ కాకపోయినా ప్రచారం మొదలు పెట్టేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇలా టిఆర్ఎస్-బిజెపిలు హోరాహోరీగా తల పడుతుంటే కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో హుజురాబాద్ లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే నాయకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం సమయం చూసి బలమైన నాయకుడిని హుజరాబాద్ బరిలో దింపుతామని చెబుతున్నారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు గెలిచే ఛాన్స్ ఉందని, ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దానికి కొత్త వ్యూహం చెబుతున్నారు. బీజేపీ-టీఆర్ఎస్‌ల మధ్య ఓట్లు చీలడం వల్ల, అది కాంగ్రెస్ కలిసొస్తుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇక్కడ 60 వేల ఓట్లు వచ్చాయని,  కాబట్టి కాంగ్రెస్ ఓటు బ్యాంకు అలాగే ఉందని, మిగిలిన ఓట్లను టిఆర్ఎస్-బిజెపిలు చీల్చుకుంటాయని, దానివల్ల కాంగ్రెస్‌కే లాభం జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. ఒక బలమైన అభ్యర్థి నిలబడితే ఇక్కడ కాంగ్రెస్‌దే విజయం అని ధీమాగా ఉన్నారు. చూడాలి మరి కాంగ్రెస్ ధీమా ఎంత వరకు నిజం అవుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news