సినిమాలో రౌడీల లాగా తయారయ్యారు : రేవంత్ రెడ్డి సెటైర్లు

-

టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు రేవంత్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. బిజేపి, టీఆరెఎస్ వాళ్లు.. డ్రామాలు ఆడుతున్నారని… అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో వుందని ఎద్దేవా చేశారు రేవంత్‌. ఆ సినిమాలో రౌడీ లాగా ఈ నాయకులు తయారయ్యారని చురకలు అంటించారు. ఒకరినొకరు కొట్టుకున్నట్లు చేసి ప్రజలను చంపే ప్రయత్నం చేస్తున్నారని… సహారా కుంభకోణం లో కెసిఆర్ ను కేంద్రమే కాపాడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన పిర్యాదులు తొక్కిపెడ్తున్నాడని ఫైర్‌ అయ్యారు.

వ్యవసాయ కమిషనర్ కు రైతుల సమస్యలపై వినతి పత్రం ఇద్దామని వచ్చామని…కేంద్ర, రాష్ట్ర సర్కార్ లు.. జేఏసీ గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయన్నారు. జేఏసీ అంటే..జాయింట్ ఆక్టింగ్ కమిటీ అని.. 3లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టినవ్ కదా.. వాటిలో కమిషన్ అడగట్లేదని ప్రశ్నించారు.

పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని కోరుతున్నామని… ఇందిరా పార్క్ వద్ద కెసిఆర్.. రైతుల పక్షాన మాట్లాడుతాడో అని ఎదురు చూసిమని ఎద్దేవా చేశారు. ఇందిరా పార్క్ వద్ద ఏర్పాట్లు చూస్తే.. పరేషాన్ అవుతారని… ఏసీలతో ధర్నాలు , దీక్షలు చేస్తారా..? అంటూ కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. నీవు రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కళ్ళల వద్దకు వెళ్ళాలని డిమాండ్‌ చేశారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి.. మీరు ఢిల్లీకి వెళ్లి మోడీని నిలదీయాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version