Big Boss Non Stop: డేంజర్ జోన్‌లో అజయ్..ఎలిమినేషన్ గ్యారంటీ!

-

బిగ్ బాస్ ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓటింగ్ పర్సంటేజీ పరంగా చూసుకుంటే ఈ వారం మొత్తంలో అందరి కంటే తక్కువ ఓటింగ్ పర్సంటేజీ సాధించిన పర్సన్ గా అజయ్ ఉన్నాడు. శుక్రవారం నాటికి అజయ్ ఓటింగ్ పర్సంటేజీ 6 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో అజయ్ డెఫినెట్ గా ఎలిమినేషన్ కు ఫస్ట్ ప్రయారిటీ అని బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు.

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అజయే..అంటూ సోషల్ మీడియాలోనూ వార్తలొస్తున్నాయి. ఓటింగ్ పర్సంటేజీ పరంగా ఈ వారంలో మొత్తంగా ఓటింగ్ పర్సంటేజీ సాధించడంలో సత్తా చాటుతున్నాడు అఖిల్. శుక్రవారం వరకు టాప్ ప్లేస్ లో 36 శాతం ఓటింగ్ తో అజయ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో అనిల్ 31 శాతం, మూడో ప్లేస్ లో హమీద 16 శాతం ఓటింగ్ పర్సంటేజీలో ఉంది. ఇక అషురెడ్డికి 8 శాతం ఓటింగ్ రాగా, అజయ్ కి 6 శాతం ఓటింగ్ వచ్చింది.

ఓటింగ్ పర్సంటేజీ పరంగా డెఫినెట్ గా అజయ్ ఎలిమినేషన్ ఫస్ట్ ప్రయారిటీ, కాగా, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నెక్స్ట్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరు అనేది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఓటింగ్ పరంగా చూస్తే నెక్స్ట్ కంటెస్టెంట్ అషురెడ్డియే కావాలి. అనగా..అషురెడ్డి, అజయ్ ఇద్దరూ ఎలిమినేట్ కావాలి. కానీ, గత కొద్ది రోజులు ‘బిగ్ బాస్’ అషురెడ్డిని కావాలనే సేవ్ చేస్తు్న్నాడని వార్తలొస్తు్న్నాయి.

ఆ ప్రకారంగా అషురెడ్డిని సేవ్ చేసి, అజయ్, హమీదలను గేమ్ నుంచి బయటకు పంపితే మాత్రం ‘బిగ్ బాస్’ పైన ఉన్న నమ్మకం పోతుందని బీబీ లవర్స్, రివ్యుయర్స్ చెప్తున్నారు. చూడాలి మరి.. బిగ్ బాస్ ఏం చేస్తాడో..వీకెండ్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌజ్ లోని పరిస్థితుల గురించి ఏం మాట్లాడుతారు అనేది కూడా చర్చనీయాంశమవుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news