కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో “బచావో హైదరాబాద్” పేరిట అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసు శాఖలో సమర్థులైన అధికారులను పక్కనపెట్టి, సామాజిక కోణాల్లో పోస్టింగులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదోన్నతి పొందిన వారిని కూడా ఖాళీగా కూర్చోబెట్టారు అని అన్నారు.
కొందరు ఐపీఎస్ అధికారులకు రెండు కంటే ఎక్కువ శాఖలను అప్పగించారని విమర్శించారు. ఒక అధికారి ఏడున్నరేళ్లుగా ఒకే స్థానంలో ఉన్నారని అన్నారు. హైదరాబాదులో పట్టపగలు కూడా పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపే పరిస్థితి లేదని అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉండాలంటే సమర్థవంతులకు పోస్టింగులు ఇవ్వాలని చెప్పారు. నలుగురు ఐపీఎస్ ల చేతుల్లో 15 శాఖలు ఉన్నాయని అన్నారు.
నిజాయితీగా పనిచేసే ఐపిఎస్ అధికారులను డిజిపి కార్యాలయానికి ఆటాచ్ చేశారని విమర్శించారు. కెసిఆర్ తనకు నచ్చిన వాళ్లకు నజరానాలు, నచ్చని వాళ్లకు జరిమానాలు ఇస్తున్నారని చెప్పారు. కెసిఆర్ తన తొత్తులకే పోస్టింగులు ఇస్తున్నారని మండిపడ్డారు.